Dinesh Prasad | ఆంగ్ల మీడియంపై తల్లిదండ్రులకున్న మోజు ఆత్మహత్య కంటే తక్కువేమీ కాదని ఎన్సీఈఆర్టీ చీఫ్ దినేశ్ ప్రసాద్ సక్లానీ అన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. చాలాచోట్ల సరైన శిక్షణ పొందిన లేనప్పటికీ తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం వైపు మొగ్గు చూపుతున్నారన్న ఆయన.. అలా చేయడమంటే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లేనన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాణ్యమైన విద్య అందుతుందని చెప్పారు. కంటెంట్ మొత్తాన్ని ఇంగ్లీష్‌లో నింపడమంటే పిల్లలను వారి మూలాలు, సంస్కృతి నుంచి దూరం చేయడమే అవుతుందన్నారు. దీంతో పాటు విజ్ఞానంపై ప్రభావం చూపుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మాతృభాష ఆధారిత బోధన ఉంటేనే మూలాలను సరిగ్గా అర్థం చేసుకోగలమన్నారు. అయితే వివిధ భాషలను నేర్చుకోవడానికి దోహదం చేస్తుందని.. భాష అంటే శక్తిని ఇచ్చేలా ఉండాలి తప్ప కోల్పోయేలా ఉండకూడదన్నారు.