బెంగళూరు: ఒక విద్యార్థి పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. స్నేహితులు అతడ్ని ఎగతాళి చేశారు. అయితే తల్లిదండ్రులు ఏమాత్రం నిరాశ చెందలేదు. పైగా పరీక్షల్లో కుమారుడి వైఫల్యాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. (Parents Celebrate Son Who Failed) మళ్ళీ ప్రయత్నించి విజయం సాధించాలని భరోసా ఇచ్చారు. కర్ణాటకలోని బాగల్కోట్లో ఈ సంఘటన జరిగింది. బసవేశ్వర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థి అభిషేక్ పదో తరగతి బోర్డు పరీక్షల్లో తప్పాడు. ఆరు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. 625 మార్కులకు గాను 200 మాత్రమే సాధించాడు.
కాగా, అభిషేక్ అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడాన్ని అతడి స్నేహితులు ఎగతాళి చేశారు. అయితే అతడి తల్లిదండ్రులు మాత్రం ఎలాంటి నిరాశ చెందలేదు. కుమారుడ్ని తిట్టడం లేదా కొట్టడం చేయలేదు. అవమానించకపోగా అతడ్ని ఎంకరేజ్ చేసేందుకు ప్రయత్నించారు. పరీక్షల్లో కుమారుడి వైఫల్యాన్ని సెలబ్రేట్ చేశారు. చిన్న వేడుక నిర్వహించారు. అభిషేక్ పేరుతోపాటు అతడు సాధించిన మార్కులతో కూడిన కేక్ కట్ చేయించి అతడికి తినిపించారు. ‘నువ్వు పరీక్షలో ఫెయిల్ అయి ఉండవచ్చు. కానీ జీవితంలో కాదు. నువ్వు మళ్ళీ ప్రయత్నించి విజయం సాధించవచ్చు’ అని తల్లిదండ్రులు అతడితో అన్నారు.
మరోవైపు పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయినప్పటికీ తనను తిట్టకుండా, అవమానించకుండా ఎంకరేజ్ చేసిన తల్లిదండ్రుల తీరు చూసి అభిషేక్ చలించిపోయాడు. ‘నేను ఫెయిల్ అయినప్పటికీ, నా కుటుంబం నన్ను ప్రోత్సహించింది. నేను మళ్ళీ పరీక్షలు రాస్తా. ఉత్తీర్ణుడవుతా, జీవితంలో విజయం సాధిస్తా’ అని అన్నాడు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు స్ఫూర్తిగా నిలిచే ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Parents celebrate inspite of their son failing in 10th exam. They ask him to do well next time 🫡 pic.twitter.com/Tpb9ZsFqkS
— Voice Of Parents Association ® (@VoiceOfParents2) May 3, 2025