సహచరులపై కాల్పులు జరిపిన జవాన్.. ఇద్దరు మృతి
Porbandar | గుజరాత్‌లోని పోర్బందర్లో అనుకోని ఘటన చోటుచేసుకున్నది. డిసెంబర్లో జరుగబోయే ఎన్నికల విధుల నిర్వహణకు వచ్చిన ఓ జవాన్.. తన సహచరులపై కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు పారామిలిటరీ జవాన్లు
అహ్మదాబాద్: గుజరాత్‌లోని పోర్బందర్లో అనుకోని ఘటన చోటుచేసుకున్నది. డిసెంబర్లో జరుగబోయే ఎన్నికల విధుల నిర్వహణకు వచ్చిన ఓ జవాన్.. తన సహచరులపై కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు పారామిలిటరీ జవాన్లు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మణిపూర్‌కు చెందిన సీఆర్పీఎఫ్ బెటాలియన్‌కు చెందిన జవాన్లు ఎన్నికల విధుల్లో భాగంగా పోర్బంర్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుఫాను పునరావాస కేంద్రంలో ఉన్నారు.
కాగా, శనివారం సాయంత్రం బస్సులో ప్రయాణిస్తుండగా వారిమధ్య గొడవ తలెత్తింది. దీంతో ఎస్.ఇనౌచాసింగ్ అనే జవాన్.. తన తోటి జవాన్లపై కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడినవారిని జామ్‌నగర్‌లోని భావ్సింగ్జీ దవాఖానకు తరలించారు.

మరణించినవారిని తోయిబా సింగ్, జితేందర్ సింగ్‌గా, గాయపడినవారిని చోరజిత్ సింగ్, రోహికానగా గుర్తించామన్నారు. వారిలో ఒకరికి పొత్తికడుపులోకి బుల్లెట్ దూసుకెళ్లగా, మరొకరి కాలుకు గాయమైందని పోలీసులు తెలిపారు. మొదటి దశలో భాగంగా పోర్బందర్లో డిసెంబర్ 1న ఎన్నికలు జరుగనున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

