సిడ్నీ, ఆగస్టు 2 : ఎప్పుడో 150 ఏండ్ల క్రితం తన పూర్వీకులు తీసుకున్న ఒక పుస్తకాన్ని ఒక పాఠకుడి వారసుడు గ్రంథాలయానికి అప్పగించిన ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. తమ ఇల్లు పునరుద్ధరణ పనులు జరుగుతుండగా, చిమ్మీలోని ఒక చెక్కపెట్టెలో ఈ పుస్తకం కన్పించిందని, దాంతో దానిని తిరిగి అప్పగించడమే సబబుగా భావించి తీసుకువచ్చినట్టు ఆ వ్యక్తి తెలిపాడు. దానిమీద తేదీలను పరిశీలించగా, అది 1870లో తీసుకున్నట్టు తేలింది.
అప్పటి రికార్డులు తమ వద్ద లేవని, అయినా ఆ పుస్తకాన్ని స్వీకరిస్తున్నట్టు గ్రంథాలయ నిర్వాహకులు తెలిపారు. గ్రంథాలయ నిబంధనల ప్రకారం పుస్తకానికి ఫైన్ విధిస్తే అది రూ.19 లక్షలవుతుందని తెలిపారు. అయితే దానిని వసూలు చేయడం లేదన్నారు. కాగా, ఇకపై తాము ఆ పుస్తకాన్ని ఎవరికీ ఇవ్వమని, ఇచ్చి మరో 150 ఏండ్లు ఎదురు చూడలేమని నిర్వాహకులు సరదాగా వ్యాఖ్యానించారు.