Leopards | మహారాష్ట్ర (Maharashtra) నాసిక్ (Nashik)లో శుక్రవారం రెండు చిరుత పులుల (2 Leopards) సంచారం తీవ్ర కలకలం రేపింది. పట్టపగలే నగరంలోని వీధుల్లో తిరుగుతూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి.
నగరంలోని సవాతా నగర్ (Savata Nagar) ప్రాంతంలో ఓ చిరుత సంచారాన్ని ప్రజలు ముందుగా గుర్తించారు. ఆ తర్వాత ఆ ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని గోవింద్ నగర్లో మరో చిరుత స్థానికుల కంటపడింది. రెండు చిరుతలూ వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. ఇరుకైన వీధుల్లో సంచరిస్తూ.. ఇళ్లల్లోకి ప్రవేశిస్తూ ప్రజలను హడలెత్తించాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని రెండు చిరుతల కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో కొన్ని గంటలపాటు శ్రమించి వాటిని పట్టుకున్నారు. కాగా, చిరుతల సంచారానికి సంబందించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
नाशिक: सिडको भागात शिरलेल्या बिबट्याला पकडले.#nashik pic.twitter.com/taOxKfcX0t
— Lokmat (@lokmat) November 17, 2023
2 leopards rescued today morning from #nashik city. 2 km distance from each other. Rescue operation done by @MahaForest Nashik & @resqct@ranjeetnature @neha_panchamiya @nashik_feed @TamhiniGhat pic.twitter.com/E6C95Up9IQ
— Akshay Mandavkar🌿 (@akshay_journo) November 17, 2023
Also Read..
World Cup Final | వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు మోదీ, ధోనీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా వాయుసేన విన్యాసాలు
Rajinikanth | వందశాతం పక్కా.. ఈ సారి ప్రపంచకప్ మనదే : రజినీకాంత్
Paras Saklecha | ఫకీర్ బాబా చేత చెప్పుదెబ్బలు తిన్న కాంగ్రెస్ అభ్యర్థి.. వీడియో