Devi Sri Prasad |పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై అభిమానుల్లో భారీ అంచనాలు కొనసాగుతున్నాయి. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఇదే కాంబినేషన్లో మరో సినిమా రావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే స్పెషల్ బజ్ ఏర్పడింది. ఇందులో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తూ గ్లామర్‌తో పాటు ఎనర్జీని కూడా జోడిస్తున్నారు. ఏప్రిల్‌లో థియేటర్లకు రానున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మాస్ బీట్లు, చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన స్టైలిష్ డ్యాన్స్ ఈ పాటను ఫ్యాన్స్ ఫేవరెట్‌గా మార్చేశాయి.
ఈ సాంగ్ హిట్ జోరులో తాజాగా మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదే పాటకు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వయంగా స్టెప్పులు వేస్తూ వీడియో చేయడం. విదేశీ వీధుల్లో స్టైలిష్‌గా డ్యాన్స్ చేస్తూ దేవి ఇచ్చిన ఎనర్జీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు కూడా భారీ వ్యూస్, షేర్లు వస్తుండటంతో ‘దేఖ్ లేంగే సాలా’ క్రేజ్ మరింత పెరిగింది. స్టేజ్ అయినా, వీధైనా ..ఎక్కడైనా తన మ్యూజిక్కు తగ్గట్టుగా డ్యాన్స్‌తో అదరగొట్టడం దేవికి కొత్తేమీ కాదు. ఈసారి కూడా అదే ఉత్సాహంతో పాటను మరో లెవల్‌కు తీసుకెళ్లాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
‘దేఖ్ లేంగే సాలా’ సక్సెస్‌తో పాటు దేవి శ్రీ ప్రసాద్ స్టెప్పుల వీడియో వైరల్ కావడంతో, ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో మిగిలిన పాటలపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. మాస్ బీట్లు, క్యాచీ ట్యూన్స్‌తో ఈ ఆల్బమ్ పూర్తిగా ఫ్యాన్స్‌ను ఊపేయబోతుందనే టాక్ వినిపిస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ – దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ మ్యూజిక్ ఎలా హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను మరోసారి రిపీట్ చేయడానికి దేవి సిద్ధంగా ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు మ్యూజిక్ పరంగా ఇప్పటికే భారీ ప్లస్ కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ చిత్రం నుంచి వచ్చే అప్డేట్స్ పవన్ అభిమానుల్లో హంగామా మరింత పెంచేలా ఉన్నాయన్నది స్పష్టంగా తెలుస్తోంది.
A Rockstar @ThisIsDSP‘s special recreation of the chartbuster #DekhlengeSaala ❤🔥
The energy & visuals are just lit 🔥🔥#UstaadBhagatSingh
POWER STAR @PawanKalyan @harish2you @sreeleela14 #RaashiiKhanna @ThisIsDSP @rparthiepan @DoP_Bose #AnandSai @Venupro @MythriOfficial… pic.twitter.com/rg1982dgPE— Mythri Movie Makers (@MythriOfficial) January 4, 2026