Kamayani Express | కామయాని ఎక్స్‌ప్రెస్‌లో బాంబు వదంతులు కలకలం సృష్టించాయి. మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలోని బీనా జంక్షన్లో రైలును నిలిపివేసి దర్యాప్తు చేపుడుతున్నారు. రైలు బల్లియా నుంచి లోకమాన్య తిలక్ టెర్మినస్‌కు కామయాని (11072) ఎక్స్‌ప్రెస్ బయలుదేరింది. అయితే రైలులో బాంబు ఉందన్న వదంతులతో రైలులో కలకలం రేగగా.. వెంటనే అధికారులకు సమాచారం అందించగా.. బీనా స్టేషన్లో నిలిపివేశారు. ఆ తర్వాత ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్తో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రయాణికులకు రైలు నుంచి దింపి వేసి తనిఖీ చేశారు.
ఆ తర్వాత డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. అంతకు ముందు రైల్వేస్టేషన్లో అలెర్ట్ ప్రకటించారు. బీనా స్టేషన్‌కు చేరుకుతున్న తర్వాత దర్యాప్తు బృందం బారికేడ్లు వేసి సోదాలు నిర్వహించారు. స్టేషన్లోకి రాకుండా ప్రయాణికులను నిలిపివేశారు. ఆ తర్వాత రైలును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం బాంబ్ స్క్వాడ్ సైతం ప్రతి బోగీని పరిశీలిస్తున్నది. ఇప్పటి వరకు ఎలాంటి వస్తువులను గుర్తించలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రైలులో బాంబు వార్తలతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఇదిలా ఉండగా.. గతేడాది సైతం కామయాని ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు పెట్టినట్లుగా వదంతులు వచ్చాయి. రైలును ఉత్తరప్రదేశ్‌లోని జాంగీ స్టేషన్లో నిలిపివేశారు. దాదాపు మూడు గంటల పాటు రైలును తనిఖీ చేయగా.. ఆ తర్వాత అబద్ధమని తేలింది.