భువనేశ్వర్: ఒడిశా ఎమ్మెల్యే, బిజూ జనతా దళ్ (బీజేడీ) నేత దేబి ప్రసాద్ మిశ్రా తన వ్యాఖ్యలతో గందరగోళం సృష్టించారు. 5టీ పథకానికి కార్యదర్శిగా ఉన్న వీకే పాండ్యనే తమ సీఎం అంటూ రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేశారు. కటక్‌లో ముఖ్యమంత్రి వర్చువల్‌గా ఒక పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా జరిగిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దీనిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తున్నది. మే 31న బీజేడీ ఎంపీ పరిమళ బిసోయి కూడా పాండ్యన్ గురించి ఒక బహిరంగ సభలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. కాగా, దీనిపై శుక్రవారం ఎమ్మెల్యే దేబి ప్రసాద్ మిశ్రా యూ టర్న్ తీసుకున్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు.