బెళగావి: కర్ణాటకలో ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ) 2ఏ క్యాటగిరీలో తమను చేర్చాలని డిమాండ్ చేస్తున్న పంచమశాలి లింగాయత్‌లు పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. కుడలసంగమ పంచమశాలి మఠాధిపతి బసవ జయమృత్యుంజయ స్వామి నేతృత్వంలో గురువారం వీరు నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రస్తుతం ఈ వర్గం ఓబీసీ 3బీ క్యాటగిరీలో ఉంది.
ప్రభుత్వోద్యోగాలు, విద్యావకాశాల్లో 5% రిజర్వేషన్లు పొందుతున్నది. 2ఏ క్యాటగిరీలోకి చేర్చితే 15 % రిజర్వేషన్లు పొందవచ్చు. నిరసనలో పాల్గొన్న పంచమశాలి లింగాయత్‌లపై మంగళవారం లాఠీఛార్జి జరిగింది.