న్యూఢిల్లీ, నవంబర్ 26: శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) కలిగిన వాళ్లంతా కేంద్రం కొత్తగా తీసుకువస్తున్న పాన్ 2.0కు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ మంగళవారం స్పష్టత ఇచ్చింది. ‘ఇప్పటివరకు జారీచేసిన పాన్ కార్డ్లు ‘పాన్ 2.0’ వ్యవస్థలోనూ చెల్లుబాటు అవుతాయి. ఇక క్యూఆర్ కోడ్ అన్నది కొత్తదేమీ కాదు. 2017-18 నుంచి ఇస్తున్న పాన్ కార్డులపై అది ఉంటున్నది. క్యూఆర్ కోడ్ లేనివాళ్లు పాన్ 2.0 ద్వారా కొత్తవి పొందొచ్చు’ అని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ వివరించింది. రూ.1,435 కోట్లతో కేంద్రం ‘పాన్ 2.0’ ప్రాజెక్ట్ చేపడుతున్న సంగతి తెలిసిందే.