IND Vs Pak | దిత్వా తుపాను ప్రభావంతో శ్రీలంక అతలాకుతలమైంది. పొరుగుదేశానికి సహాయం అందించడంలో భారత్ రంగంలోకి దిగింది. ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో మానవ సహాయాన్ని అందిస్తున్నది. అయితే, పాక్ సైతం శ్రీలంకకు సహాయం చేస్తామని ముందుకు రాగా.. భారత్ సహకారం అందించింది. పాక్ విమానాలు భారత గగనతలం మీదుగా శ్రీలంకు అనుమతి ఇచ్చింది. అడిగిన వెంటనే పాక్‌కు అనుమతి ఇవ్వగా.. ఆదేశం భారత్ ఉద్దేశపూర్వకంగా మానవతా సహాయ విమానాలను అడ్డుకుంటోందని, శ్రీలంకకు సహాయాన్ని అందించడంలో ఆలస్యం చేస్తోందని పాకిస్తాన్ ఆరోపించింది. అయితే, పాకిస్తాన్ ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. అదే రోజు మానవతా దృక్పథంతో పాకిస్తాన్ అభ్యర్థనను కేవలం నాలుగు గంటల్లోనే ఆమోదించిందని పేర్కొంది.
ఈ అంశంపై పాకిస్తాన్ చేస్తున్న ప్రచారాన్ని, వార్తలను తోసిపుచ్చింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ పాక్ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకట హాస్యాస్పదమన్నారు. భారత్పు దుష్ప్రచారానికి మరో ప్రయత్నమన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో శ్రీలంకకు పూర్తి సహకారం అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. డిసెంబర్ ఒకటిన మధ్యాహ్నం ఒంటిగంటకు ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌కు పాక్ అభ్యర్థన వచ్చిందని.. అదే రోజున సాయంత్రం 7.30 గంటలకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. భారత్ గగనతలం అనుమతి ఇవ్వలేదంటూ వచ్చిన వార్తలన్నీ అవాస్తవమన్నారు. పాక్ ఫేక్ వ్యార్తలను వ్యాప్తి చేస్తోందని.. భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు.
మానవతా సహాయానికి ప్రాధాన్యత ఇవ్వడం భారతదేశ విధానమని.. ఇలాంటి విషయాల్లో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు. అన్ని అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఈ ప్రక్రియ పూర్తయిందని, కేవలం నాలుగు గంటల్లోనే ఆమోదం ఇచ్చామని.. భారత్ తక్కువ సమయంలోనే ఆమోదం స్పష్టం చేశారు. భారత్ తమ విమానాలను 60 గంటలకుపైగా అనుమతి నిరాకరించింది పాక్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఆరోపించింది. అనుమతికి సమయ పరిమితి, తిరుగు ప్రయాణానికి నిరాకరించడం వల్ల సహాయ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడిందంటూ వితండ వాదం చేసింది. తుపాను శ్రీలంకలో పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించింది. రోడ్లు దెబ్బతిన్నాయి. వంతెనలు ధ్వంసమయ్యాయి. ఇప్పటి వరకు 410 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 336 మంది గల్లంతయ్యారు. దాంతో భారత్ ఆపరేషన్ సాగర్ బంధు ప్రారంభించి శ్రీలంకు సహాయ సామగ్రి, వైద్య సహాయం, కీలకమైన వస్తువులను అందించింది. గతంలోనూ శ్రీలంకకు భారత్ సహాయం అందించింది.