న్యూఢిల్లీ: పబ్జీ గేమ్‌లో పరిచయమైన వ్యక్తిని పెండ్లి చేసుకోవడానికి పాకిస్థాన్ నుంచి భారత్‌కు అక్రమంగా వచ్చిన వివాహిత సీమా హైదర్ ఇప్పుడు బాలీవుడ్లో అడుగుపెట్టనుంది! ఉదయ్‌పూర్‌లో కొందరు ఇస్లామిక్ అతివాదుల చేతిలో మరణించిన టైలర్ కన్హయ్య లాల్ హత్య ఉదంతం ఆధారంగా నిర్మిస్తున్న ‘ఏ టైలర్ మర్డర్ స్టోరీ’లో ఆమె నటించనుంది. ఈ మేరకు నిర్వాహకులు మంగళవారం ఆమెను కలిసి ఆడిషన్ కూడా నిర్వహించారు. ఆమె ఈ చిత్రంలో రా ఏజెంట్ పాత్రను పోషించనున్నట్టు తెలిసింది.