న్యూఢిల్లీ : బీది జలైలే సాంగ్‌కు పాకిస్తాన్ జంట క్రేజీ స్టెప్స్‌తో డ్యాన్స్ ఫ్లోర్‌ను హోరెత్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను పాక్‌కు చెందిన వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ పోస్ట్ చేయగా, సిగ్నేచర్ బై బిలాల్ ఇజాజ్ అనే పేజ్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ఈ వీడియోను ఇప్పటివరకూ 30 లక్షల మందికి పైగా వీక్షించారు.
ఈ వీడియోలో 2006లో విడుదలైన ఓంకార మూవీ ఐకానిక్ సాంగ్‌కు పాక్ జంట క్యూట్ మూమెంట్స్‌తో డ్యాన్స్ చేయడం నెటిజన్లను ఆకట్టుకుంది. హుషారైన పాట క్యాచీ బీట్స్‌కు అనుగుణంగా వారు డ్యాన్స్ ఫ్లోర్లో ఈజ్‌తో స్టెప్స్ వేయడం అలరించింది. వారు డ్యాన్స్ చేస్తుండగా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, గ్రేస్ నెటిజన్లను మైమరపించింది. ఎంత అద్భుత ప్రదర్శన..డ్యాన్స్ ఫ్లోర్ హోరెత్తింది అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.