న్యూఢిల్లీ : పాకిస్తాన్ కొరియోగ్రాఫర్ ఝూమే జో పఠాన్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియో (Viral Video) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏకే కొరియోగ్రఫీ అనే పేజ్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఈ క్లిప్‌కు పది లక్షలకు పైగా వ్యూస్ లభించాయి.
పఠాన్ మూవీ గ్రాండ్ సక్సెస్ సాధించి బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కు గ్రేట్ కమ్‌బ్యాక్ ఫిల్మ్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ కాసులవర్షం కురిపించి సరికొత్త రికార్డులు సాధించింది. ఇక ఈ మూవీలోని బేషరం రంగ్, ఝూమే జో పఠాన్ సాంగ్‌లకు పలువురు డ్యాన్స్ చేస్తూ రీక్రియేషన్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
లేటెస్ట్ వీడియోలో అహ్మద్ ఖాన్ అనే కొరియోగ్రాఫర్ ఝూమే జో పఠాన్ సాంగ్‌కు హుషారైన స్టెప్స్ వేశారు. వెడ్డింగ్ వేడుకలో ఎపిక్ పెర్ఫామెన్స్‌తో అహ్మద్ ఖాన్ అదరగొట్టాడు. ఖాన్ పెర్ఫామెన్స్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. జోర్దార్ అంటూ ఓ యూజర్ ప్రశంసలు గుప్పించగా టూ గుడ్ అంటూ మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :
Sushmita Sen | సుష్మితా సేన్‌కు గుండెపోటు.. నటి పోస్ట్ వైరల్..!
Mahesh Babu | సూపర్ ఫిట్‌గా మహేశ్ బాబు.. ట్రెండింగ్‌లో నయా వర్కవుట్ లుక్స్