Sushmita Sen | సుష్మితా సేన్‌కు గుండెపోటు.. నటి పోస్ట్ వైరల్..!
Sushmita Sen | బాలీవుడ్ స్టార్ నటి (Bollywood Star Actress), మాజీ విశ్వసుందరి (former Miss Universe) సుష్మితా సేన్ (Sushmita Sen) ఇటీవల గుండెపోటుకు (Heart Attack) గురైందట. ఈ విషయాన్ని నటి సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించింది.
Sushmita Sen | బాలీవుడ్ స్టార్ నటి (Bollywood Star Actress), మాజీ విశ్వసుందరి (former Miss Universe) సుష్మితా సేన్ (Sushmita Sen) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. మిస్ యూనివర్స్ (Miss Universe) కిరీటం గెలుచుకుంది. ఆపై బాలీవుడ్ (Bollywood)లో అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ తొలినాళ్లలోనే స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కాగా, సుష్మితా సేన్ (Sushmita Sen) ఇటీవల గుండెపోటుకు (Heart Attack) గురైందట. ఈ విషయాన్ని నటి సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించింది.
‘మీ హృదయాన్ని సంతోషంగా, ధైర్యంగా ఉంచుకోండి. మీకు అవసరమైనప్పుడు అది అండగా ఉంటుంది. (మా నాన్న సుబీర్ సేన్ చెప్పిన మాటలు). నేను రెండు రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యాను. వైద్యులు యాంజియోప్లాస్టీ (Angioplasty ) చేసి స్టెంట్ (stent) అమర్చారు. ఈ ప్రమాదం నుంచి నన్ను బయటపడేలా చేసిన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. మరో పోస్ట్‌లో అన్ని విషయాలు వివరిస్తాను. అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఈ పోస్ట్ పెట్టడానికి కారణం.. నా అభిమానులకు, శ్రేయోభిలాషులకు నేను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పేందుకే. ప్రస్తుతం నాకేం పర్లేదు. అంతా బాగానే ఉంది. గతంలో మాదిరి నేను సాధారణ జీవితం గడపొచ్చు. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు సుష్మితా సేన్ (Sushmita Sen) త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read..
Vladimir Putin | విలాసవంతమైన విల్లాలో.. గర్ల్‌ఫ్రెండ్‌తో పుతిన్ రహస్య జీవితం..!
JNU | జేఎన్‌యూ కీలక నిర్ణయం.. ధర్నా చేస్తే రూ.20వేలు ఫైన్, హింసకు పాల్పడితే అడ్మిషన్ రద్దు..!
Supreme Court | ఈసీల నియామక ప్రక్రియపై సుప్రీం కీలక తీర్పు
Gauri Khan | చిక్కుల్లో షారుక్ భార్య.. గౌరీ ఖాన్‌పై చీటింగ్ కేసు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

