Vladimir Putin | విలాసవంతమైన విల్లాలో.. గర్ల్‌ఫ్రెండ్‌తో పుతిన్ రహస్య జీవితం..!
Vladimir Putin | రష్యా అధ్యక్షుడు (Russian president) వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) తన గర్ల్‌ఫ్రెండ్ అలీనా (Alina)తో కలిసి ఖరీదైన, విలాసవంతమైన విల్లాలో సీక్రెట్‌గా (secretly living) గడుపుతున్నట్లు రష్యన్ఇన్వెస్టిగేటివ్న్యూస్ సైట్ ‘ది ప్రాజెక్ట్’ (Russian investigative news site The Project) తెలిపింది.
Vladimir Putin | రష్యా (Russia) – ఉక్రెయిన్ (Ukraine) మధ్య యుద్ధం (War) మొదలైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు (Russian president) వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత, పిల్లలు, ఆరోగ్యానికి సంబంధించి పలు విషయాలు అంతర్జాతీయ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో ఓ వార్త మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. అదే జిమ్నాస్ట్ (gymnast), ఒలింపిక్స్ గోల్డ్‌మెడలిస్ట్ (Olympic Goldmedalist) అయిన 39 ఏండ్ల అలీనా కబయేవా (Alina Kabaeva)తో పుతిన్ (Putin)కు ఉన్న బంధం. వీరిద్దరూ రిలేషన్లో ఉన్నట్లు గతంలో తెగ ప్రచారం జరిగింది. అయితే, ఆ వార్తలపై పుతిన్ ఎప్పుడూ స్పందించలేదు. కాగా, వీరిద్దరికి సంబంధించిన మరో ఆసక్తికర వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం పుతిన్ (Putin) తన గర్ల్‌ఫ్రెండ్ అలీనా (Alina)తో కలిసి ఖరీదైన, విలాసవంతమైన విల్లాలో సీక్రెట్‌గా (secretly living) గడుపుతున్నట్లు రష్యన్ఇన్వెస్టిగేటివ్న్యూస్ సైట్ ‘ది ప్రాజెక్ట్’ (Russian investigative news site The Project) తెలిపింది. మాస్కో (Moscow)కు వాయువ్యంవైపు ఉన్న లేక్వాల్దై (Lake Valdai)కు సమీపంలోని ఓ ఎస్టేట్‌లో వీరు రహస్యంగా ఉంటున్నట్లు (secretly living) వెల్లడించింది. ప్యాలెస్‌లో అలీనా కబయేవాతో పాటు కొందరు పిల్లలను కూడా చూసినట్టు ఓ అధికారి చెప్పినట్లుగా ‘ది ప్రాజెక్ట్’ తన కథనంలో పేర్కొంది. అలీనాకు చెందిన మహిళా బంధువులు కూడా ఎస్టేట్‌లోనే ఉన్నట్టు వివరించింది.
పుతిన్.. ఆ ఎస్టేట్‌ను 120 మిలియన్ డాలర్లు వెచ్చించి తన ప్రేయసి కోసం రెండేండ్ల క్రితం ప్రత్యేకంగా కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ విల్లా నిర్మాణ పనులు 2020లో మొదలై.. రెండేండ్లల్లో ముగిశాయి. ఆ తర్వాత, గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి పుతిన్అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ఎస్టేట్13వేల చదరపు అడుగల విస్తీర్ణంలో నిర్మించారు. గతంలో బయటకొచ్చిన ఫొటోల ప్రకారం.. ఈ ఎస్టేట్‌లో బంగారంతో తయారు చేసిన కుర్చీలు, గ్లాస్ టేబుల్స్వంటి అత్యంత ఖరీదైన వస్తువులు ఉన్నాయి. అందులోని గదులు చాలా రిచ్ లుక్‌లో ఆకర్షణీయంగా కనిపించాయి.
అయితే, పుతిన్ (Putin) మాత్రం అలీనా కబయేవాను (Alina Kabaeva) తన ప్రేయసిగా అధికారికంగా ఎప్పుడూ ప్రకటించలేదు. పుతిన్‌కు చెందిన యునైటెడ్ రష్యా పార్టీకి ప్రాతినిధ్యం వహించిన అలీనా.. ఆరేండ్లపాటు పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు. ప్రస్తుతం నేషనల్ మీడియా గ్రూప్ డైరెక్టర్ల బోర్డు చైర్‌పర్సన్‌గా గత ఎనిమిదేండ్లుగా ఆమె పనిచేస్తున్నారు.
Also Read..
JNU | జేఎన్‌యూ కీలక నిర్ణయం.. ధర్నా చేస్తే రూ.20వేలు ఫైన్, హింసకు పాల్పడితే అడ్మిషన్ రద్దు..!
Supreme Court | ఈసీల నియామక ప్రక్రియపై సుప్రీం కీలక తీర్పు
Gauri Khan | చిక్కుల్లో షారుక్ భార్య.. గౌరీ ఖాన్‌పై చీటింగ్ కేసు..!
Daily Walk | రోజూ 11 నిమిషాలు నడిస్తే చాలు.. ఆ ముప్పు నుంచి బయటపడొచ్చు
Adenovirus | ఆందోళన కలిగిస్తున్న అడెనోవైరస్.. 24గంటల్లో ఏడుగురు చిన్నారులు మృతి..!
Virat Kohli | ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో కష్టాల్లో టీం ఇండియా.. మైదానంలో స్టెప్పులేసిన కోహ్లీ..!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

