Virat Kohli | ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో కష్టాల్లో టీం ఇండియా.. మైదానంలో స్టెప్పులేసిన కోహ్లీ..!
Virat Kohli | టీం ఇండియా (Team India) స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ (Virat Kohli) మైదానంలో ఎంత సీరియస్‌గా ఉంటాడో.. అప్పుడప్పుడు అంతే సరదాగా కనిపిస్తుంటాడు.
Virat Kohli | టీం ఇండియా (Team India) స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. విరాట్ (Virat Kohli) బ్యాట్ (Bat) పట్టాడంటే పరుగుల వరద పారాల్సిందే. అలాంటిది ఇటీవల కాలంలో ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. అయితే ఒక్కోసారి తన బ్యాట్‌తో విజృంభిస్తూ ఆకట్టుకుంటున్నాడు. విరాట్ కోహ్లీ (Virat Kohli) మైదానంలో ఎంత సీరియస్‌గా ఉంటాడో.. అప్పుడప్పుడు అంతే సరదాగా కనిపిస్తుంటాడు.
ప్రేక్షకుల్ని బ్యాట్‌తోనే కాకుండా తన డ్యాన్స్‌తోనూ అలరించే ప్రయత్నం చేస్తుంటాడు. నాగ్‌పూర్ (Nagpur) వేదికగా ఇటీవల జరిగిన తొలి టెస్టులో షారూక్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన ‘పఠాన్’ (Pathaan) మూవీలోని సాంగ్‌కి సరదాగా డ్యాన్స్ (Dance) చేసిన కోహ్లీ (Kohli).. ఇండోర్ (Indore) వేదికగా బుధవారం ప్రారంభమైన మూడో టెస్టులోనూ స్టెప్పులేస్తూ కనిపించాడు.
మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు (Team India) తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే ఆలౌటైంది. అది కూడా కేవలం 33.2 ఓవర్లలోనే కుప్పకూలిపోయింది. 52 బంతులాడిన విరాట్ కోహ్లీ 2 ఫోర్లు కొట్టి 22 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా టీమ్ 12 పరుగుల వద్దే ట్రావిస్ హెడ్ వికెట్ కోల్పోయినా.. ఆ తర్వాత 108 పరుగుల వరకూ రెండో వికెట్ ఇవ్వలేదు. దాదాపు 32 ఓవర్లు వికెట్ పడకపోవడంతో కెప్టెన్ రోహిత్ శర్మ సహా ఇతర ఆటగాళ్లు అసహనంతో ఉన్నారు.
అలాంటి సమయంలో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) ఉన్నట్లుండి ఒక్కసారిగా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. అది కూడా పాట పాడుకుంటూ.. స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. కాగా, నాలుగు టెస్టుల ఈ సిరీస్‌లో భారత్ జట్టు ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.
Also Read..
Virushka | అనుష్క త్యాగాలు చాలా గొప్పవి.. భార్యపై కోహ్లీ ప్రశంసల వర్షం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
రఘునందన్ కృషి స్ఫూర్తిదాయకం.. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటయ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

