Pakistan | పహల్గాం దాడి ఘటన తర్వాత పాకిస్తాన్‌పై భారత్ చర్యలకు ఉపక్రమించింది. ఆ దేశ పౌరులు వెంటనే భారత్‌ను విడిచి వెళ్లాలని ఆదేశించింది. సార్క్ వీసాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, భారత్ నిర్ణయాలపై సైతం పాక్ స్పందించింది. భారత్‌తోనూ అన్ని వాణిజ్య కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌కు చెందిన అన్ని విమానయాన సంస్థలకు చెందిన విమానాలకు పాక్ గగనతలాన్ని తక్షణం మూసివేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పాకిస్తాన్ ప్రధాన కార్యాలయం ప్రెస్‌నోట్ విడుదల చేసిందని జాతీయ మీడియా పేర్కొంది. ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నివాసంలో పాకిస్తాన్ త్రివిధ దళాల అధిపతులు, ఇతర ప్రభుత్వ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. పాకిస్తాన్ గుండా లేదంటే.. మూడవ దేశాల నుంచి వెళ్లే వస్తువులతో సహా భారతదేశంతో అన్ని వాణిజ్యాన్ని కూడా నిలిపివేసింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారతదేశ నిర్ణయాన్ని వ్యతిరేకించిందని ఓ నివేదిక తెలిపింది.
పాకిస్తాన్‌కు కేటాయించిన నీటిని అడ్డుకోవడం, దారి మళ్లించడం.. దిగువ రాష్ట్రంగా దాని హక్కులను ఉల్లంఘించడం వంటి ఏదైనా చర్యను ‘యుద్ధ చర్య’గానే పరిగణిస్తామని పాకిస్తాన్ ప్రభుత్వం పేర్కొంది. దాడి ఘటన తర్వాత పాక్‌పై భారత్ కఠిన చర్యలకు దిగింది. ఈ క్రమంలో పాకిస్థాన్ పౌరులకు వీసా సేవల్ని నిలిపివేసింది. మెడికల్ వీసా సహా పాక్ జాతీయులకు జారీ చేసిన అన్ని వీసాలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే వీసా పొందిన వారికి ఏప్రిల్ 27 వరకు గడువు ఇచ్చింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది. అయితే, మెడికల్ వీసాలపై ఉన్న వారికి మాత్రం కొంత వెసులుబాటు కల్పించింది. ఈ నెల 29 వరకూ వారికి సమయం ఇచ్చింది. వీసా గడువు ముగిసేలోపు భారత్‌ను వీడాలని చెప్పింది. పాక్ పౌరులకు వీసా సేవల్ని నిలిపివేశామని.. ఆ దేశ జాతీయులకు భారత్ జారీ చేసిన అన్ని వీసాలను రద్దు చేశామని.. ఇప్పటికే జారీ చేసిన వీసాలు ఏప్రిల్ 27 వరకూ చెల్లుబాటు అవుతాయన్నారు. మెడికల్ వీసాలు మాత్రం 29 వరకు చెల్లుబాటు అవుతాయని.. భారత్‌లో ఉన్న పాక్ జాతీయులు వీసా గడువు ముగిసేలోపు దేశాన్ని వీడి మీ దేశాలకు వెళ్లిపోవాలని విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొంది.