ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి భారత్ కంటే మెరుగ్గా ఉన్నదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్‌లో మంగళవారం ఇంటర్నేషనల్ చాంబర్స్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. పాక్‌లో ఇప్పటికీ జీవనవ్యయం చాలా చవక అని పేర్కొన్నారు. చాలా దేశాల్లో కంటే పాక్‌లో చమురు ధరలు తక్కువగా ఉన్నాయని చెప్పారు.