న్యూఢిల్లీ: పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ తన కార్యకలాపాలను విస్తరించేందుకు మరో కొత్త కుట్రకు తెరలేపింది. కేవలం మహిళలతో ఓ ఉగ్రవాద గ్రూప్‌ను తయారుచేస్తున్నది. మసూద్ అజర్ సోదరి సాదియా అజర్ నేతృత్వంలో ‘జమాతుల్-ముమినాత్’ పేరుతో ఓ ప్రత్యేక యూనిట్‌ను తయారుచేస్తున్నది.
బుధవారం పాకిస్థాన్‌లోని బహావల్పూర్లో మర్కజ్ ఉస్మాన్ అలీ అనే ప్రాంతంలో ప్రత్యేక యూనిట్‌ను ప్రారంభించినట్టు జాతీయ మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి. తీవ్రవాదుల భార్యలు, పేద మహిళలను రిక్రూట్ చేసుకొవడానికి జైషే మహమ్మద్ తొలుత ప్రాధాన్యం ఇస్తున్నది. బహావల్పూర్, కరాచీ, ముజఫరాబాద్, కోటిలీ, హరిపూర్ మదర్సాల్లోని మహిళలను ఉగ్రవాదం వైపు తీసుకొస్తున్నట్టు తెలిసింది.