లండన్: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది మరణించడంపై భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా భారతీయ నిరసనకారులను పాకిస్థాన్ అధికారి బెదిరించాడు. గొంతు కోస్తామన్నట్లుగా సంజ్ఞ చేశాడు. (Pak Official’s ‘Throat-Slit’ Gesture) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. శుక్రవారం లండన్‌లోని పాకిస్థాన్ హైకమిషన్ వెలుపల ప్రవాస భారతీయులు నిరసన ప్రదర్శన చేపట్టారు. సుమారు 500 మంది బ్రిటీష్ హిందువులు ఇందులో పాల్గొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిని వారు ఖండించారు. ఉగ్రవాదం, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రవాద గ్రూపులకు పాకిస్థాన్ మద్దతు ఇస్తోందని విమర్శించారు. ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళి అర్పించారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరుగాలని డిమాండ్ చేశారు. అక్కడ దేశ భక్తి గీతాలు ప్లే చేశారు.
కాగా, లండన్‌లోని పాకిస్థాన్ హైకమిషన్‌లో ఉన్న ఆ దేశ ఆర్మీ, ఎయిర్ అడ్వైజర్ కల్నల్ తైమూర్ రహత్ ఈ సందర్భంగా భారతీయ నిరసనకారులను బహిరంగంగా బెదిరించాడు. గొంతు కోస్తామన్నట్లుగా సంజ్ఞ చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఆర్మీ అధికారి తీరుతోపాటు ఆ దేశంపై విమర్శలు వెల్లువెత్తాయి.
देखिए ये लंदन में पाकिस्तान के डिप्लोमैट हैं… pic.twitter.com/2Obo5cxCys
— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) April 26, 2025