న్యూఢిల్లీ: పార్లమెంట్లో ఇవాళ అరుదైన ఘటన చోటుచేసుకున్నది. వివిధ మైనార్టీ మతాలకు చెందిన పెద్దలు(Religious Leaders) ఇవాళ పార్లమెంట్‌ను విజిట్ చేశారు. ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ను వాళ్లు కలువనున్నారు. పార్లమెంట్లో జరుగుతున్న సభాకార్యక్రమాలను వాళ్లను వీక్షించనున్నారు. ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ ఉమ్ అహ్మాద్ ఇలియాసి మాట్లాడుతూ పైగామ్ ఏ మొహబత్ హై, పైగామ్ దేశ్ హై అంటూ కామెంట్ చేశారు. ప్రధాని మోదీని కలవనున్నట్లు ఆయన చెప్పారు.
ఇండియన్ మైనార్టీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు హిమాని సూద్ మాట్లాడుతూ భారత్ ఒక్కటే ప్రపంచ దేశాలకు చెప్పేందుకే తాము పార్లమెంట్‌కు వచ్చినట్లు తెలిపారు. వివిధ రకాల మత పెద్దలతో కలిసి ఇండియన్ మైనార్టీ ఆర్గనైజేషన్ పార్లమెంట్‌కు వచ్చినట్లు పేర్కొన్నారు.
#WATCH | Religious leaders representing various minority sections of the country meet Vice President and Rajya Sabha Chairman Jagdeep Dhankhar at the Parliament
They will later meet Prime Minister Narendra Modi and will also watch the proceedings of Parliament. pic.twitter.com/iVBsNc1tib
— ANI (@ANI) February 5, 2024