Pahalgam Attackers | గత వారం పెహల్గామ్లోని మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరాన్ వ్యాలీలో నరమేధానికి పాల్పడిన ఉగ్రవాదులు ఇంకా జమ్ము కశ్మీర్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రఘటన జరిగి వారం రోజులు గడిచినా దాడికి పాల్పడిన ముష్కరులు (Pahalgam Attackers) మాత్రం ఇంకా కశ్మీర్‌లోనే దాగి ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఎన్ఐఏ (NIA Sources) వర్గాలు తాజాగా వెల్లడించాయి.
ముష్కరులు దక్షిణ కశ్మీర్ (south Kashmir)లో తలదాచుకున్నట్లు ఎన్ఐఏ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన బలమైన ఆధారాలు ఉన్నట్లు తాజాగా వెల్లడించాయి. ఒకవేళ భద్రతా బలగాలు వారిని గుర్తించి కాల్పులు జరిపితే.. కవర్ ఫైర్ చేసేలా మరింతమంది ముష్కరులను వీరికి బ్యాకప్‌గా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ ఉనికి బయటపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు సదరు వర్గాలు గుర్తించాయి. ఆహార సామగ్రితోపాటు ఇతర ముఖ్యమైన వస్తువులను తమవెంట తీసుకెళ్లినట్లు గుర్తించామని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. అటవీ ప్రాంతంలో ఎక్కువ కాలం గడిపినా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లూ చేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు దక్షిణ కశ్మీర్ ప్రాంతంలో మరింత మంది ఉగ్రవాదులు దాక్కుని ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
Pahalgam Attack | ఉద్రిక్తతలు తగ్గించుకోండి.. భారత్, పాక్‌కు అమెరికా సూచన