Hafiz Saeed | డ్రోన్లతో నిఘా.. ఇంటిచుట్టూ పాక్ ఆర్మీ పహారా.. టెర్రరిస్ట్ హఫీజ్‌కు పాక్ ప్రభుత్వం ఇస్తున్న భద్రత ఇది..!
Hafiz Saeed |జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా టాప్ కమాండర్ (Lashkar commander) హఫీజ్ సయీద్ (Hafiz Saeed) హస్తం ఉన్నట్లు పలు కథనాలు వెల్లడిస్తున్న విషయం తెలిసిందే.
Hafiz Saeed |జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా టాప్ కమాండర్ (Lashkar commander) హఫీజ్ సయీద్ (Hafiz Saeed) హస్తం ఉన్నట్లు పలు కథనాలు వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడింది తామే అని ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)’ ప్రకటించినప్పటికీ.. దీని వెనుక హఫీజ్ హస్తం ఉందని అంతర్జాతీయ మీడియా నివేదిస్తోంది. ఈ నేపథ్యంలో హఫీజ్ విషయంలో పాక్ వ్యవహారశైలి ఆ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది.
పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ కరుడుగట్టిన ఉగ్రవాదికి పాకిస్థాన్ ప్రభుత్వం భద్రతను పెంచింది. గతంతో పోలిస్తే భద్రతను భారీగా పెంచింది. లాహోర్‌లోని హఫీజ్ నివాసం వద్ద పాక్ ప్రభుత్వం నాలుగంచెల భద్రతను కల్పిస్తోంది. హఫీజ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అయినప్పటికీ రహస్య ప్రదేశంలో కాకుండా.. లాహోర్ (Lahore)లోని జోరమ్ తౌమ్ అనే అత్యంత రద్దీ ప్రాంతంలో తన ఫ్యామిలీతో కలిసి నివాసం ఉంటున్నాడు. దీంతో ప్రస్తుతం ఆయన ఇంటి చుట్టూ పాక్ ఆర్మీ, ఐఎస్ఐ, లష్కరే ముఠా నిరంతరం పహారా కాస్తున్నట్లు తాజాగా వెల్లడైంది.
ఇంటి కాంపౌండ్ చుట్టూ డ్రోన్లతో నిఘా పెట్టినట్లు సమాచారం. ఇంటికి నలువైపులా దాదాపు నాలుగు కిలోమీటర్ల పరిధిలో అత్యాధునిక సీసీటీవీ కెమెరాలను అమర్చినట్లు తెలుస్తోంది. ఆ ఇంటి వైపుకు సామాన్య ప్రజలను ఎవరినీ అనుమతించట్లేదు. పెహల్గామ్ దాడి నేపథ్యంలో అతడిని లక్ష్యంగా చేసుకొని దాడులు జరగొచ్చన్న సమాచారంతో పాక్ ప్రభుత్వం ఈ టెర్రరిస్ట్‌కు భద్రత పెంచినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది.
హఫీజ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అయినప్పటికీ రహస్య ప్రదేశంలో కాకుండా.. లాహోర్ (Lahore)లోని జోరమ్ తౌమ్ అనే అత్యంత రద్దీ ప్రాంతంలో తన ఫ్యామిలీతో కలిసి నివాసం ఉంటున్నట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అతడికి ఇప్పటికే పాక్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తుండటం గమనార్హం. హఫీజ్ నివాసం వద్ద పాక్ ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం భద్రత కల్పిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా బుధవారం వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను కూడా బయటపెట్టింది. అతని ఇంటి వద్ద పార్క్, మసీదు, మదర్సాలు కూడా ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. భవనం కింద ఓ బంకర్ కూడా ఉందని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉండే కరుడుగట్టిన ఉగ్రవాదుల బృందం గత నెల 22న బైసరాన్లో నిర్దాక్షిణ్యంగా 26 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే. నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఆ బృందంలో ప్రధానంగా విదేశీ ఉగ్రవాదులు ఉంటారు. ఆ ఉగ్రవాదులకు స్థానిక ఉగ్రవాదులతోపాటు కశ్మీర్లో మద్దతుదారులు కొందరు సహకరించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వ మద్దతుతో హఫీజ్ సయీద్, అతడి ముఖ్య అనుచరులు ఈ ఉగ్రమూకలకు నేరుగా సాయపడి ఉండవచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ముంబైలో 26/11 దాడికి కారకుడైన హఫీజ్ సయీద్ ఈ దాడిలో పాల్గొన్న టెరరిస్టులకు కూడా అన్ని రకాలుగా సహాయసహకారాలు అందించి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రదాడికి పాల్పడిన బృందం చాలాకాలంగా కశ్మీర్ లోయలో క్రియాశీలకంగా ఉన్నట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది సోనామార్గ్, బూతాపత్రీ, గండేర్బల్ దాడుల్లో ఈ బృందమే పాలుపంచుకున్నట్లు తెలిసింది. గత అక్టోబర్‌లో బూతాపత్రిలో జరిగిన దాడిలో ఇద్దరు ఆర్మీ జవాన్లు సహా మొత్తం నలుగురు మృతి చెందారు. అదే నెలలో సోనామార్గ్ టెన్నెల్ కార్మికులను టార్గెట్ చేస్తూ జరిగిన దాడిలో ఆరుగురు కార్మికులతో పాటు ఓ డాక్టర్ మరణించారు. ఇక సయూద్‌ను భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి కూడా అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడి తలపై అమెరికా 10 మిలియన్ డాలర్ల రివార్డ్ ప్రకటించింది.
Also Read..
Pahalgam Attack | ఉద్రిక్తతలు తగ్గించుకోండి.. భారత్, పాక్‌కు అమెరికా సూచన
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

