Khawaja Asif | విశ్వసనీయ నిఘా సమాచారం ఉందట.. 24-36 గంటల్లో భారత్ సైనిక చర్య: పాకిస్థాన్ రక్షణ మంత్రి
ఒక పక్క భారత్ ఎప్పుడు సైనిక దాడికి దిగుతుందోనని భయంతో వణుకుతూనే మరో పక్క అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పాకిస్థాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నది.
- దాడి చేస్తే తీవ్ర చర్యలు తప్పవని భారత్కు హెచ్చరిక
- యుద్ధం అవకాశాలు క్షణం క్షణం పెరుగుతున్నాయన్న ఖవాజా అసిఫ్
Khawaja Asif | ఇస్లామాబాద్, ఏప్రిల్ 30: ఒక పక్క భారత్ ఎప్పుడు సైనిక దాడికి దిగుతుందోనని భయంతో వణుకుతూనే మరో పక్క అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పాకిస్థాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నది. ‘మాకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం భారత్ రానున్న 24-36 గంటల్లో సైనిక చర్యకి దిగుతుంది. అదే కనుక జరిగితే న్యూఢిల్లీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు’ అని బుధవారం పాకిస్థాన్ ఒక ప్రకటనలో హెచ్చరించింది.
దాడి చేసే విధానం, సమయం, లక్ష్యాలను నిర్ణయించే ‘పూర్తి స్వేచ్ఛ’ త్రివిధ దళాలకు ఇస్తూ ప్రధాని మోదీ మంగళవారం ఆదేశాలు ఇచ్చిన క్రమంలో పాకిస్థాన్ ఈ ప్రకటన చేసింది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు చాలా దేశాలు ప్రయత్నిస్తున్నప్పటికీ, సమయం గడుస్తున్నకొద్దీ యుద్ధం వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ చెప్పారు. పార్లమెంటు వెలుపల బుధవారం ఆయనను విలేకర్ల ప్రశ్నించిపుడు ఆయన ఈ విధంగా స్పందించారు. భారత దేశం ఉల్లంఘనకు పాల్పడితే, తాము దీటుగా ప్రతిస్పందిస్తామని చెప్పారు. భారత్ చర్యను బట్టి తమ స్పందన ఉంటుందని, భారత్ చర్య కన్నా భారీగా ఉంటుందని అన్నారు. పాకిస్థాన్ స్పందన గురించి ఎటువంటి సందేహం అక్కర్లేదన్నారు. భారత్ వివేకంతో వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

