Pahalgam Attack | పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత్ కఠిన చర్యలకు ఉప్రకమించింది. అయితే, దాడి ఘటన తర్వాత భారత్ ఎలాంటి చర్యలు తీసుకుబోతోందని పాకిస్తాన్ భయాందోళనకు గురవుతున్నది. ఈ క్రమంలో ఈ నెల 24-25 తేదీల్లో జరిగిన ఎకనామిక్ జోన్లో కరాచీ తీరంలో ఉపరితలం నుంచి ఉపరితలం వరకు లక్ష్యాలను ఛేదించే క్షిపణులను పరీక్షించేందుకు పాకిస్తాన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, పరిణామాలన్నింటిని భారతీయ ఏజెన్సీలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. గతంలో ఉగ్రవాదులు దాడులకు ఆత్మాహుతికి పాల్పడడంతో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత పాకిస్తాన్‌పై భారత్ సైర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మళ్లీ భారత ఎలాంటి దాడులు చేస్తుందోనని పాకిస్తాన్ ఆందోళనకు గురవుతున్నారు.
పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. సింధు జలాల ఒప్పందం రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ దేశంపై ఆందోళన మరింత పెరిగింది. భారత్ దాడి చేస్తుందని పాకిస్తాన్ భావిస్తున్నది. ఇందులో భాగంగానే మిస్సైల్స్‌ని పరీక్షిస్తుంది. పాకిస్తాన్ వైమానిక దళం, నావికదళానికి నోటీసులు జారీ చేసింది. ఏదైనా దాడి జరిగితే ప్రతిస్పందించాలని సైన్యాన్ని అప్రమత్తం చేసింది. పాకిస్తాన్ నేవీ విన్యాసాలు మొదలుపెట్టిందని భారత్‌లో రక్షణ, భద్రతా సంస్థల వర్గాలు తెలిపాయి. భారత కదలికలను పాక్ పరిశీలిస్తూ వస్తున్నది. పహల్గాం దాడి ఘటనకు పాల్పడిన వారితో పాటు వారి స్పాన్సర్లను జవాబుదారీగా చేస్తామని భారత్ స్పష్టం చేసింది. పాకిస్తాన్లో జరుగుతున్న కార్యకలాపాలను భారత ఏజెన్సీలు నిశితంగా గమనిస్తున్నాయి.
పాకిస్తాన్ సైన్యం సన్నాహాలను పర్యవేక్షిస్తున్నారు. పహల్గాం దాడి తర్వాత భారతదేశంలో జరిగిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS) సమావేశంలో ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు. పహల్గాం దాడితో పాకిస్తాన్ సంబంధాలపై చర్చించారు. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతును ఉపసంహరించుకునే వరకు.. 1960 నాటి సింధు జల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు కేంద్రం చర్యలు తీసుకున్నది. అయితే, భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తక్షణం ప్రభావం చూపకపోయినా.. దీర్ఘకాలికంగా ఇబ్బందులుపడే అవకాశాలున్నాయి. అలాగే, అట్టారిలోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ కూడా తక్షణమే మూసివేశారు. ఎస్ఏఏఆర్సీ వీసా మినహాయింపు పథకం (SVES) కింద పాకిస్తాన్ జాతీయులను భారత్‌లో పర్యటించేందుకు అనుమతించరు. గతంలో పాక్ జాతీయులకు జారీ చేసిన వీసాలు రద్దయ్యాయి. వీసాలు రద్దయిన నేపత్యంలో భారత్‌ను విడిచి వెళ్లేందుకు 48 గంటల సమయం ఉంటుంది.