Pahalgam attack : పహల్గాం (Pahalgam) లో ఉగ్రవాదులు (Terrorists) జరిపిన క్రూరమైన దాడి ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తుండగా తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) రంగంలోకి దిగింది. బుధవారం మధ్యాహ్నం జాతీయ దర్యాప్తు సంస్థకు చెందిన ఓ బృందం ఉగ్రదాది జరిగిన ప్రాంతానికి చేరుకుంది.
కాగా, జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంకు సమీపంలోగల బైసరాన్ లోయలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఐదుగురు ముష్కరులు సైనికుల దుస్తుల్లో వచ్చి పర్యాకులే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుష పర్యాటకులను కాల్చిచంపారు. కాల్పుల్లో మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడి సమాచారం అందిన వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్ముకశ్మీర్‌కు వెళ్లారు. ప్రధాని మోదీ తన సౌదీ పర్యటనను కుదించుకుని తిరిగొచ్చారు.