మెదక్ అర్బన్, జూన్ 26 : ఎస్.ఐ.ఆర్.(SIR) పై అనుమానాలు ఉంటే ఎప్పటికప్పుడు పార్టీ నాయకులను, బీఎల్వోగా నియమించిన ఏజెంట్లను అడిగి తెలుసుకోవాలని మెదక్ బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వార్డులలో ఓట్లు మిస్ కాకూడదన్నారు. మెదక్లో ఎస్ ఐ ఆర్ పై అవగాహన సదస్సులో పాల్గొని ఆమె మాట్లాడారు. గ్రామాల్లో కొంతమంది బలవంతంగా ఓట్లు నమోదు చేస్తున్నారని ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఎస్ ఐ ఆర్ అనే ప్రోగ్రాం కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించిందని, మనకు ఇచ్చిన సమయం లోపల కష్టపడి బీఎల్ఓలను కలిసి ఓట్లు మిస్ కాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫారుక్ హుస్సేన్, సుభాష్ రెడ్డి, కంటారెడ్డి తిరుపతిరెడ్డి, మామిళ్ళ ఆంజనేయులు, మల్లికార్జున గౌడ్, బట్టి జగపతి, బట్టి ఉదయ్, సురేందర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, ముహమ్మద్ అలీ, సంతు , ప్రదీప్, ఆర్కే శ్రీనివాస్, జుబేర్, తదితరులు పాల్గొన్నారు.