గ్యాంగ్టక్, జూన్ 5: సిక్కిం ముఖ్యమంత్రి పీఠాన్ని సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్కేఎం) అధ్యక్షుడు ప్రేమ్ సింగ్ తమాంగ్ రెండోసారి అధిష్ఠించనున్నారు. గతంలో చేసినట్టే రాజధాని గ్యాంగ్టక్లోని పల్జోర్ స్టేడియంలో ఈ నెల 9న ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తమాంగ్ బుధవారం మీడియాకు తెలిపారు. తనతో పాటు మంత్రి మండలి సభ్యులు కూడా ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు.