Pune | పుణె, : ఇంట్లో 300 పిల్లులను పెంచుతున్న ఓ మహిళపై సొసైటీ వాసులు ఫిర్యాదు చేయడంతో మహారాష్ట్ర పశు సంవర్ధక శాఖ, పోలీసు అధికారులు ఇక్కడి హౌసింగ్ సొసైటీలోని ఓ ఫ్లాట్‌ను సందర్శించారు.
తన ఇంట్లో ఉన్న పిల్లులను వేరే చోటికి తరలించవలసిందిగా ఆ మహిళకు నోటీసు అందచేసినట్టు ఇక్కడ హడప్సర్ పోలీసు స్టేషన్ అధికారి ఒకరు సోమవారం తెలిపారు. ఆ ఫ్లాట్ దుర్గంధభరితంగా ఉందని, పిల్లులను వేరే చోటుకు తరలించాలని ఆదేశించినట్టు పోలీసు అధికారి చెప్పారు.