భోపాల్ : బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కూలి.. ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. రూ.80 కోట్లతో నిర్మిస్తున్న ఓవర్బ్రిడ్జ్పై కార్మికులు కాంక్రీట్ పనులు చేస్తుండగా.. ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం సంభవించింది.
శివపురి జిల్లాలో నిర్మిస్తున్న వంతెనలో కొంతభాగం కూలిందని, దాని కింద ఎవరూ లేనందున ప్రాణనష్టం తప్పిందని, గాయపడ్డ వారిని దవాఖానకు తరలించామని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. సుభం కన్స్ట్రక్షన్ అనే సంస్థకు నిర్మాణ పనులు అప్పగించినట్టు చెప్పారు.