చండీగఢ్: పని చేసే ఫ్యాక్టరీలో చోరీ చేశారన్న అనుమానంతో మహిళ, ఆమె ముగ్గురు కుమార్తెల పట్ల అవమానకరంగా ప్రవర్తించారు. వారి ముఖాలకు నల్లరంగు పూశారు. ‘నేను దొంగను’ అన్న ఫ్లకార్డులను మెడలో వేసి అక్కడ ఊరేగించారు. (Woman, Daughters Paraded) ఈ సంఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు స్పందించారు. పంజాబ్‌లోని లూథియానాలో ఈ సంఘటన జరిగింది. బహదూర్కే రోడ్డులోని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న గార్మెట్ ఫ్యాక్టరీలో ఒక మహిళ, ఆమె ముగ్గురు కూతుళ్లు పని చేస్తున్నారు.
కాగా, కొన్ని దుస్తులను వారు దొంగిలించినట్లు యజమాని, మేనేజర్ ఆరోపించి శిక్ష విధించారు. ఈ నేపథ్యంలో ఆ మహిళ, ఆమె కుమార్తెలైన ముగ్గురు బాలికలను ఫ్యాక్టరీ ఆవరణలో బంధించారు. వారి ముఖాలకు నల్ల రంగు పూశారు. ‘నేను దొంగను. నా తప్పును అంగీకరిస్తున్నా’ అని రాసి ఉన్న ప్లకార్డులను వారి మెడలో వేసి అక్కడ ఊరేగించారు.
మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు స్పందించారు. ఫ్యాక్టరీ యజమాని పర్వీందర్ సింగ్, మేనేజర్ మన్‌ప్రీత్ సింగ్, ఈ చర్యను వీడియో తీసి షేర్ చేసిన ముహమ్మద్ కైష్పై కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. వీరిలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు చెప్పారు.
కాగా, పంజాబ్ రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్ చైర్మన్ కన్వర్దీప్ సింగ్ ఈ సంఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు ‘తాలిబాన్ తరహాలో శిక్ష’ విధించినట్లు అభివర్ణించారు. పిల్లల హక్కులను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. పంజాబ్ రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఈ సంఘటనపై స్పందించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
Ludhiana, Punjab: In Ludhiana, a mother and her three daughters were humiliated for allegedly stealing clothes from a factory. They were forced to wear ‘thief’ posters, their faces blackened, and a viral video sparked outrage pic.twitter.com/B2ja2OBbOQ
— IANS (@ians_india) January 22, 2025