న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నుంచి బ్రిటన్ రాజధాని లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని డెన్మార్క్‌కు మళ్లించారు. (Air India Flight Diverted) కోపెన్‌హగాన్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు. ఈ మేరకు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురి కావడం దీనికి కారణమని పేర్కొంది. ఆదివారం ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ నుంచి లండన్‌కు బయలుదేరింది. అయితే విమానం గాలిలో ఉండగా ఒక ప్రయాణికుడి ఆరోగ్యం క్షీణించింది. దీంతో డెన్మార్క్ రాజధాని కోపెన్హగాన్కు ఆ విమానాన్ని మళ్లించారు. అక్కడి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేశారు. అనారోగ్యానికి గురైన ప్రయాణికుడ్ని విమానం నుంచి దించారు. అతడ్ని వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు.
కాగా, మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఆదివారం ఢిల్లీ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానాన్ని కోపెన్హగాన్కు మళ్లించినట్లు ఎయిర్ ఇండియా అధికారి తెలిపారు. ఇతర ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించడానికి ఎయిర్‌పోర్ట్‌లోని గ్రౌండ్ సిబ్బంది చాలా సహకరించారని చెప్పారు. ఆ తర్వాత విమానం కోపెన్‌హగాన్ నుంచి బయలుదేరి లండన్ చేరుకున్నదని వెల్లడించారు.