బెంగళూరు: భూ వివాదం నేపథ్యంలో ఒక కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులపై ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. ఆ తర్వాత వారిని దారుణంగా నరికి చంపారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. (6 People Shot, Hacked To Death) కర్ణాటకలోని విజయపుర జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గోవిందపూర్ గ్రామానికి చెందిన నిరాలే, గోలగి కుటుంబాల మధ్య చాలా కాలంగా భూ వివాదం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో నిరాలే కుటుంబ సభ్యులపై గోలగి కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఆరుగురిపై తొలుత కాల్పులు జరిపారు. ఆ తర్వాత వారందరినీ దారుణంగా నరికి చంపారు.
కాగా, ఈ సమాచారం తెలుస్తున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను చందు నిరాలే, దుండప్ప నిరాలే, శివపుత్ర నిరాలే, రాహుల్ నిరాలే, సమర్థ్ నిరాలే, షబ్బీర్ నదాఫ్గా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు దీర్ఘ కాల భూ వివాదం వల్ల నిరాలే కుటుంబ సభ్యుల హత్యలో గోలగి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.