Kedarnath: కిక్కిరిసిన కేదార్నాథ్.. 3 రోజుల్లో 90 వేల మంది భక్తులు
Kedarnath: కేదార్నాథ్ భక్తులతో నిండిపోతున్నది. భారీ సంఖ్యలో బాబాను దర్శించుకుంటున్నారు. ఈ ఏడాది ఆలయాన్ని ఓపెన్ చేసిన మూడు రోజుల్లోనే సుమారు 90 వేల మంది భక్తులు కేదార్నాథ్ చేరుకున్నారు.
రుద్రప్రయాగ్: ఛార్థామ్ యాత్రలో భాగమైన కేదార్నాథ్(Kedarnath)కు భక్తులు పోటెత్తారు. జ్యోతిర్లింగాన్ని దర్శించుకునేందుకు జనం ఎగబడుతున్నారు. ఆలయాన్ని ఓపెన్ చేసిన తొలి మూడు రోజుల్లోనే సుమారు 90 వేల మంది భక్తులు కేదార్నాథ్ చేరుకున్నారు. దీంతో కేదారీశ్వరుడి దర్శనం ఆలస్యం అవుతున్నది. బుధవారమే కేదార్నాథ్ ఆలయాన్ని ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. రుద్రప్రయాగ్ ఎస్పీ నిహారిక తోమర్ మాట్లాడుతూ.. భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నట్లు వెల్లడించారు.
First darshan of Baba Kedarnath 😍
Har Har Mahadev 🙌 pic.twitter.com/Q5HVMMXozx
— Sunanda Roy 👑 (@SaffronSunanda) April 24, 2026
ఏప్రిల్ 22వ తేదీన మొదటి రోజు సుమారు 38 వేల మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నట్లు చెప్పారు. రెండో రోజు 25 వేల మంది, మూడో రోజు 30 వేల మంది యాత్రికులు కేదార్నాథ్ చేరుకున్నారు. కేదార్నాథ్ థామ్లో భద్రత కట్టుదిట్టంగా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. రాష్ట్ర పోలీసులతో కేంద్ర పారామిలిటరీ బలగాలను కూడా మోహరించినట్లు ఎస్పీ వెల్లడించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఎమర్జెన్సీ దళాలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.
జిల్లా మెజిస్ట్రేట్ విశాల్ మిశ్రా ఆలయ పరిసరాల్లో పర్యవేక్షణ చేశారు. ట్రావెల్ అప్డేట్స్ గురించి పోలీసు, అడ్మినిస్ట్రేషన్ విభాగం అందించే సమాచారాన్ని మాత్రమే భక్తులు ఫాలోకావాలన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

