న్యూఢిల్లీ : వివిధ కేసుల్లో నిందితులుగా నమోదై, విదేశాలకు పరారైనవారిని గుర్తించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. 2024, 2025లో ‘వాంటెడ్’ జాబితాలోని వారిలో 70 మంది విదేశాలకు పారిపోయినట్లు పేర్కొంది. వీరిలో 27 మంది తిరిగి మన దేశానికి వచ్చారని వివరించింది.
ఇతర దేశాలు వెతుకుతున్న నిం దితులు మన దేశంలో 203 మంది ఉన్నారని తెలిపింది. తమ దర్యాప్తునకు సహకరించాలని విదేశాలకు 74 లెటర్ ఆఫ్ రొగేటరీలను పంపినట్లు తెలిపింది.