Maha Kumbh Mela | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పోటెత్తారు. వసంత పంచమి నేపథ్యంలో మహాకుంభ మేళాకు (Maha Kumbh Mela) భారీగా తరలివచ్చారు. మూడోది, చివరి అమృత్ స్నాన్ కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు త్రివేణీ సంగమానికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఆదివారం ఉదయం 8 గంటల వరకు 41.90 లక్షల మంది భక్తులు నదీ స్నానాలు ఆచరించినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు.
#WATCH | #MahaKumbh2025 | A large number of devotees throng Triveni Sangam ghat in Prayagraj, Uttar Pradesh as they arrive here to take a holy dip.
As per Uttar Pradesh Information Department, today over 41.90 lakh devotees have taken a holy dip by 8 am. More than 33.61 crore… pic.twitter.com/aBuzXiMDFL
— ANI (@ANI) February 2, 2025
ఇక కుంభమేళా ప్రారంభమైన జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 1 వరకు 33.61 కోట్ల మందికిపైగా పుణ్యస్నానాలు చేసినట్లు తెలిపారురు. ఫిబ్రవరి 26వ తేదీ వరకూ కొనసాగే ఈ కుంభమేళాకు 50 కోట్ల మంది హాజరయ్యే అవకాశం ఉందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తున్నది. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసింది. కాగా, వసంత పంచమి నేపథ్యంలో భక్తులు హరిద్వార్‌లోని హరి కి పౌరీ వద్ద గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో చేరుకున్న భక్తులు పవిత్ర స్నానం చేసి గంగమ్మకు హారతి సమర్పించారు.
#WATCH | Uttarakhand: Devotees take a holy dip in river Ganga at Har Ki Pauri in Haridwar, on #BasantPanchami pic.twitter.com/bByUn7cyzZ
— ANI (@ANI) February 2, 2025