Kinner Kailash | ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ వర్షాలకు హిల్ స్టేట్స్ అయిన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఆకస్మిక వరదలు చుట్టుముడుతున్నాయి. నిన్న ఉత్తరకాశీ జిల్లాలో జలవిలయం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి.
Himachal Pradesh: ITBP rescues 413 pilgrims after flash flood on Kinner Kailash Yatra route
Read @ANI Story | https://t.co/i2MeUl4EcF#HimachalPradesh #ITBP #flashfloods pic.twitter.com/0WT0HCt9Wb
— ANI Digital (@ani_digital) August 6, 2025
హిమాచల్ రాష్ట్ర వ్యాప్తంగా గతకొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. టాంగ్లింగ్ ప్రాంతంలో కురిసిన వర్షం కారణంగా కిన్నెర్ కైలాష్ యాత్ర మార్గం (Kinner Kailash Yatra route)లో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదల్లో వందలాది మంది యాత్రికులు (pilgrims) పర్వత మార్గంలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సాహసోపేతమైన ఆపరేషన్ (Daring rope technique) చేపట్టారు. రోప్‌వే సాయంతో దాదాపు 413 మంది యాత్రికులను రక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
#WATCH | Himachal Pradesh | Indo-Tibetan Border Police (ITBP) team from the 17th Battalion has rescued 413 pilgrims using the rope-based traverse crossing technique, following a flash flood in the Tangling area along the Kinner Kailash Yatra route
The rescue operation is being… pic.twitter.com/EtshdR20D1
— ANI (@ANI) August 6, 2025
కాగా, రెండు రోజుల నుంచి హిమాచల్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు చాలాచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ కారణంగా దాదాపు 450 రోడ్లను అధికారులు మూసివేశారు. ముఖ్యంగా మండి జిల్లా అత్యంత ప్రభావితమైంది. ఇక్కడ దాదాపు 295 రోడ్లు మూసుకుపోయాయి. ఇక సిమ్లాలోని చక్కీమోర్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో కీలకమైన చండీగఢ్-సిమ్లా జాతీయ రహదారిని అధికారులు మూసివేయాల్సి వచ్చింది. రాష్ట్రంలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉనా, కాంగ్రా, మండి, సిర్మౌర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆ నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Also Read..
Car plunges | అదుపుతప్పి నదిలో పడిపోయిన కారు.. ముగ్గురు మృతి
Rishikesh | రిషికేశ్ వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గంగానది.. VIDEO
Uttarkashi | జలవిలయం తర్వాత.. ఉత్తరకాశీ జిల్లాకు భారీ వర్ష సూచన.. అప్రమత్తమైన అధికారులు