Rishikesh | రిషికేశ్ వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గంగానది.. VIDEO
Rishikesh | ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గంగా నది (Ganga River) ఉప్పొంగి ప్రవహిస్తోంది.
Rishikesh | ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గంగా నది (Ganga River) ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ వర్షాలకు రిషికేశ్ వద్ద గంగానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రిషికేశ్ (Rishikesh)లోని పరమార్థ నికేతన్ ఆశ్రయం వద్ద గంగమ్మ శివుని విగ్రహాన్ని (Lord Shiva) తాకుతోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
#WATCH | Rishikesh, Uttarakhand: At the Aarti Sthal of the Parmarth Niketan Ashram in Rishikesh, River Ganga touches the idol of Lord Shiva. pic.twitter.com/DB2y83mCDD
— ANI (@ANI) August 6, 2025
మంగళవారం ఉత్తరకాశీ (Uttarkashi)లో జల విలయం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. పవిత్ర చార్ధామ్లలో ఒకటైన గంగోత్రికి వెళ్లే మార్గంలోని ధరాలి (Dharali) గ్రామంపై మంగళవారం ఆకస్మిక వరదలు విరుచుకుపడ్డాయి. కుంభవృష్టి కారణంగా వచ్చిన మెరుపు వరదలకు కొండచరియలు విరిగిపడి ఇళ్లు, హోటళ్లు, కార్లు కొట్టుకుపోయాయి. ఈ ప్రకృతి విపత్తులో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. 70 మంది వరకూ గల్లంతయ్యారు. ఇక ఇప్పటి వరకూ దాదాపు 130 మందిని రెస్క్యూ టీమ్ రక్షించింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఉత్తరకాశీకి భారీ వర్ష సూచన..
ఇవాళ కూడా ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలిలో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ (weather department) హెచ్చరించింది. రాష్ట్రంలోని కొండ ప్రాంతంల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైనిటాల్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్, బాగేశ్వర్, పౌరి, తెహ్రీ, హరిద్వార్, డెహ్రాడూన్.. ఈ ఏడు జిల్లాలకు భారీ వర్షసూచన చేసింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా ఆయా జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పౌరి, చంపావత్, ఉదమ్ సింగ్ నగర్ జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఇవాళ సెలవు ప్రకటించారు.
Also Read..
Uttarkashi | జలవిలయం తర్వాత.. ఉత్తరకాశీ జిల్లాకు భారీ వర్ష సూచన.. అప్రమత్తమైన అధికారులు
Kalp Kedar Temple: ఉత్తరాఖండ్ వరదలు.. బురద, రాళ్లతో కూరుకుపోయిన ప్రాచీన కల్పకేదార్ శివాలయం
ఉత్తరాఖండ్‌లో జల విలయం.. నలుగురి మృతి.. సుమారు 60-70 మంది గల్లంతు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
Former MLA Gandra | చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన : మాజీ ఎమ్మెల్యే గండ్ర
Premada Oorali | రూ.2 కోట్ల బడ్జెట్‌తో సినిమా,బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు.. ‘ప్రేమద ఊరాలి’ సంచలనం
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

