Corona vaccination | దేశంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్నది. దీంతో ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఇందులో భాగంగా వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేశాయి. వయోజనులకు టీకా పంపిణీ విస్తృతంగా కొనసాగుతున్నది. దీంతో ఈ ఏడాది జనవరి 3న 15 నుంచి 18 ఏండ్ల టీనేజర్లకు వ్యాక్సినేషన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటివరకు 3 కోట్ల మంది టీనేజర్లు మొదటి డోసు టీకా తీసుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ప్రకటించారు.
Over 3 crore youngsters between the 15-18 age group have received 1st dose of the #COVID19 vaccine: Union Health Minister Dr Mansukh Mandaviya
— ANI (@ANI) January 13, 2022
(File photo) pic.twitter.com/IBumofE76B
15 నుంచి 18 ఏండ్ల టీనేజర్లకు వ్యాక్సినేషన్ కోసం దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో టీకా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కార్యాక్రమాన్ని ప్రారంభించిన మూడు రోజుల్లోనే కోటి మంది టీకా తీసుకున్నారు. జనవరి 8 నాటికి ఈ సంఖ్య రెండు కోట్లకు చేరింది. మొదటి డోసు తీసుకున్న నాలుగు వారాల్లో రెండో డోసు ఇవ్వనున్నారు.
దేశవ్యాప్తంగా కొత్తగా 2,47,417 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,63,17,927కి చేరాయి. ఇందులో 3,47,15,361 మంది కోలుకోగా, 4,85,035 మంది మరణించారు. మరో 11,17,531 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 154.61 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని పేర్కొన్నది.
तेज गति से जारी बच्चों का टीकाकरण 💉
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) January 8, 2022
Great Going, my Young Friends 👦🏻 👧🏻
Over 2 crore youngsters between the 15-18 age group have received their first dose of #COVID19 vaccine in less than a week of vaccination drive for children.#SabkoVaccineMuftVaccine pic.twitter.com/787C2RByHQ