న్యూఢిల్లీ : ఏటా వేలాది మంది భారత పౌరసత్వాన్ని వదులుకుని, ఇతర దేశాల పౌరసత్వాన్ని తీసుకుంటున్నారు. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అడిగిన ప్రశ్నకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లోక్‌సభకు సమాధానం చెప్పారు. భారత పౌరసత్వాన్ని వదిలిపెట్టడానికి లేదా ఇతర దేశాల పౌరసత్వాన్ని తీసుకోవడానికి కారణాలేమిటో ఆయా వ్యక్తులకే తెలియాలని మంత్రి తెలిపారు.
నాలెడ్జ్ ఎకానమీ శకంలో గ్లోబల్ వర్క్‌ప్లేస్ పరిధిని ప్రభుత్వం గుర్తించిందన్నారు. భారత సంతతి ప్రజలతో మమేకమవడంలో ప్రభుత్వం పెను మార్పులు తీసుకొచ్చిందన్నారు. విజయవంతమైన, సుసంపన్నమైన భారత సంతతి ప్రజ లు భారత దేశానికి గొప్ప సంపద అని తెలిపారు.