న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ఐటీ రంగంలో ఉద్యోగాల ఊచకోత కొనసాగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 1.5 లక్షల మంది టెకీలు ఉద్యోగాలు కోల్పోయారు. నిర్వహణ ఖర్చులు తగ్గించుకొని, అధిక డిమాండ్ ఉన్న ఏఐ, సైబర్ భద్రత లాంటి రంగాలపై కంపెనీలు దృష్టి సారించడంతో భారీగా ఉద్యోగుల తొలగింపు కొనసాగుతున్నది.
దీర్ఘ కాల అభివృద్ధిపై కంపెనీలు దృష్టి సారించడం కూడా ఉద్యోగుల తొలగింపునకు ఒక కారణం. ఉద్యోగుల తొలగింపు బాధాకరమైన అంశమైనప్పటికీ ఈ ఏడాది ఇంటెల్, టెస్లా, సిస్కో, శాప్, ఉబర్, మైక్రోసాఫ్ట్, పేపాల్, బైజూస్ తదితర దిగ్గజ సంస్థలు వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి.
1. ఆర్థిక సవాళ్లు – పెరుగుతున్న వ్యయం, కోర్ మార్కెట్లలో డిమాండ్ తగ్గుదల కంపెనీలను ఖర్చులను తగ్గించుకొనేలా చేస్తున్నది.
2. దృష్టి మార్పు – చాలా కంపెనీలు వృద్ధి చెందుతున్న ఏఐ, సైబర్ భద్రత లాంటి అంశాలపై దృష్టి పెట్టి, అప్రధాన ఆపరేషన్లను తగ్గిస్తున్నాయి.
3. వ్యాపార నమూనాల సంస్కరణ – సామర్థ్యం పెంపు, సుస్థిరత కోసం ఉద్యోగులను తొలగించడం ద్వారా వ్యాపార నమూనాలను సంస్కరించడం.
1. పర్సనల్ కంప్యూటర్ల డిమాండ్ తగ్గడం.
2.గేమింగ్ రంగం ఒడిదొడుకులు ఎదుర్కోవడం.
3.ఎడ్-టెక్ రంగంలో ఆర్థిక ఇబ్బందులు, మార్కెట్ సర్దుబాట్లు.