టెక్ కంపెనీలు భారీగా ఉద్యోగాల తొలగింపును కొనసాగిస్తున్నాయి. కొత్త ఏడాదిలో ఇప్పటివరకూ.. 51 టెక్ కంపెనీల్లో సుమారుగా 7,500 మంది ఉద్యోగుల్ని తొలగించారని ‘రాయటర్స్' వార్తా కథనం పేర్కొన్నది.
టెక్ కంపెనీల్లో మాస్ లేఆఫ్స్ (Mass Layoffs) గుబులు కొనసాగుతోంది. గత ఏడాది 1056 కంపెనీలు దాదాపు 1.64 లక్షల మంది ఉద్యోగులను తొలగించగా 2023లో కేవలం ఐదు నెలల్లోనే ఈ సంఖ్య దాటి పోవడం ఆందోళన రేకెత్తిస్తోంది.