న్యూఢిల్లీ: టెక్ కంపెనీలు భారీగా ఉద్యోగాల తొలగింపును కొనసాగిస్తున్నాయి. కొత్త ఏడాదిలో ఇప్పటివరకూ.. 51 టెక్ కంపెనీల్లో సుమారుగా 7,500 మంది ఉద్యోగుల్ని తొలగించారని ‘రాయటర్స్’ వార్తా కథనం పేర్కొన్నది. ఈ ఏడాది గూగుల్, అమెజాన్ కంపెనీలు వందలాది మంది ఉద్యోగుల్ని తొలగించాయి. ఉద్యోగాల కోత ప్రస్తుతానికి స్వల్పంగా కనిపిస్తున్నా.. ఈ ఏడాది ముందు ముందు పెద్ద సంఖ్యలో లే ఆఫ్లు ఉండబోతున్నాయని టెక్ నిపుణులు అంచనావేస్తున్నారు.