న్యూఢిల్లీ, నవంబర్ 30 : యూపీలోని ‘సంభల్’ హింసాత్మక ఘటనలపై వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకునేందుకు ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ప్రయత్నించింది. శనివారం ఎస్పీ బృందం సంభల్ చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు. బయట వ్యక్తులు సంభల్లో ప్రవేశించకుండా డిసెంబర్ 10 వరకు నిషేధాజ్ఞలను జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. తమను అడ్డుకోవటంపై ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. నిషేధం విధించటం బీజేపీ ప్రభుత్వ పరిపాలన, ప్రభుత్వ నిర్వహణ వైఫల్యమని విమర్శించారు. సంభల్ అధికారులను సస్పెండ్ చేయాలని అఖిలేశ్ ఉన్నతా ధికారులను డిమాండ్ చేశారు.