పాట్నా: ఒక కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎమ్మెల్యే పెరోల్‌పై బయటకొచ్చారు. ఆయన అభిమానులు గ్రాండ్‌గా స్వాగతం పలికారు. అనంతరం ఆ నేత జేడీయూ అభ్యర్థికి మద్దతుగా మెగా రోడ్ షో నిర్వహించారు. బీహార్‌లో ఈ సంఘటన జరిగింది. 2020లో ఆర్జేడీ టికెట్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన అనంత్ కుమార్ సింగ్‌ను (Anant Kumar Singh) ఆయుధాల కేసులో దోషిగా కోర్టు తేల్చింది. పదేళ్లు జైలు శిక్ష విధించింది.
కాగా, జైలు శిక్ష అనుభవిస్తున్న అనంత్ సింగ్ అలియాస్ చోటా సర్కార్ 15 రోజుల పెరోల్‌పై ఆదివారం బయటకు వచ్చారు. దీంతో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. భారీగా కాన్వాయ్ ఏర్పాటు చేయడంతోపాటు పూల వర్షం కురిపించారు. అనంతరం ముంగేర్ జేడీయూ అభ్యర్థి లాలన్ సింగ్‌కు మద్దతుగా బార్హ్ అసెంబ్లీ నియోజకవర్గంలో అనంత్ సింగ్ మెగా రోడ్ షో నిర్వహించారు. దీంతో ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.