న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత జైరాం రమేశ్(Jairam Ramesh) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పెహల్గామ్లో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు అక్కడ, ఇక్కడ ఫ్రీగా తిరుగుతున్నారని, అలాగే పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న మన ఎంపీల బృందం కూడా ప్రపంచ దేశాలు తిరుగుతున్నట్లు ఆయన ఆరోపించారు. పెహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులు మరో నాలుగు దాడుల్లో పాల్గొన్నట్లు చెప్పారు. కానీ వాళ్లు స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు తెలిపారు. ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మన ఎంపీలు, ఉగ్రవాదులు కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు ఆరోపించారు.
కాంగ్రెస్ వేసిన ప్రశ్నలకు బీజేపీ సమాధానం ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. బీజేపీ కేవలం తమ పార్టీని మాత్రమే టార్గెట్ చేస్తున్నదన్నారు. ఉగ్రవాదులను ఆ పార్టీ టార్గెట్ చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీపై అటాక్ చేయడం కాదు, ఉగ్రవాదులను అంతం చేయాలన్నారు. పాకిస్థాన్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. ఉగ్రవాదులను అరెస్టు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీపై మిస్సైళ్లను వదులుతున్నారని జైరాం రమేశ్ ఆరోపించారు.
Jairam Ramesh makes the most atrocious comparison
Compares our MPs in All Party Delegations exposing Pakistan to terrorists
This is how Congress undermines not just our Military Strike (Op Sindoor ) by calling it Chut Put but also our diplomatic strike
Should Parliament not… pic.twitter.com/X9wrmsdbOZ
— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) May 29, 2025