అహ్మదాబాద్, మార్చి 23: ఏ రాజకీయ పార్టీ అయినా నిధులు లేకుండా మనుగడ సాగించలేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్నికల బాండ్లపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీం కోర్టు ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని ఇప్పుడు కొట్టేసింది కానీ.. ఈ పథకాన్ని కేంద్రం సదుద్దేశంతోనే తీసుకొచ్చిందని గడ్కరీ ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చారు. ఒక వేళ ఏవైనా లోటుపాట్లు ఉన్నట్టు గుర్తిస్తే.. వాటిపై అన్ని పార్టీలు కలిసి చర్చించి సరిదిద్దుకుంటే సరిపోతుందన్నారు. ఎన్నికల బాండ్ల పథకాన్ని సు ప్రీం కోర్టు రద్దు చేసిన సంగతి విదితమే.