న్యూఢిల్లీ : కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తూ జన జీవనాన్ని అతలాకుతలం చేసినా ఆశాభావం, ప్రేమ కూడా హద్దులు లేకుండా విశ్వవ్యాప్తమైందని రాస్తూ కోకొకోలా యాడ్ ను సోషల్ మీడియాలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్ర షేర్ చేశారు. గత ఏడాది కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించినప్పుడు ఈ యాడ్ ను రూపొందించినా ఇప్పటి సెకండ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితికీ ఈ యాడ్ అద్దం పడుతోంది.
ఆశ, సానుకూల ధోరణిని ప్రేరేపించినందుకు కోకొకోలాకు థ్యాంక్స్ అంటూ ఆనంద్ మహీంద్రా ఈ పోస్ట్ కు క్యాప్షన్ గా ఇవ్వడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. రెండు నిమిషాల 14 సెకండ్ల నిడివిగల ఈ వీడియో హీరోస్ ఆఫ్ హ్యూమనిటీ అనే మెసేజ్ తో ముగిసింది. ఇక ఈ వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్ర మనమంతా ఆశావహ మతానికి చెందిన వారమని వ్యాఖ్యానించారు.
Optimism. A universal religion we can all belong to… Thank you Coca Cola pic.twitter.com/IAen8i4tCl
— anand mahindra (@anandmahindra) April 29, 2021