న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: తమ దేశంతో అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సిందిగా ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఒత్తిడి చేశారు. అలా చేయకపోతే పర్యవసనాలు ఏమిటో ఇరాన్‌కు తెలుసునని పరోక్షంగా సైనిక చర్యను ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఒప్పందం కోసం మస్కట్‌లో ఇరాన్, అమెరికా చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ట్రంప్ నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఓ భారీ నౌక ఇరాన్ వైపు కదులుతోందని శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ చెప్పారు. ప్రస్తుత చర్చలు సానుకూలంగానే ఉన్నట్లు ఆయన తెలిపారు. చర్చలపై ఇరాన్ దౌత్యవేత్త ఒకరు స్పందిస్తూ సానుకూలంగానే చర్చలు ప్రారంభమయ్యాయని ఆయన చెప్పారు.